NTV Telugu Site icon

FilmFare Awards : అట్టహాసంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుక.. బెస్ట్ యాక్టర్స్ ఎవరంటే

New Project (3)

New Project (3)

FilmFare Awards : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో 68వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ 2023‌’ వేడుక ఘనంగా జరిగింది. గురువారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ తారలోకం హాజరైంది. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ ముద్దుగుమ్మలు రెడ్ కార్పెట్​పై డిఫరెంట్ డ్రస్సులో వచ్చి కనువిందు చేశారు. ఈ ఏడాది ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బాదాయ్‌ దో’ చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ అవార్డులను కొల్లగొట్టేసింది. ఆ తర్వాత ఉత్తమ నటుడు సహా మొత్తం ఆరు కేటగిరీల్లో ‘బదాయ్‌ దో’ను అవార్డులు వరించాయి. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు ఒక్క అవార్డు రాకపోవడం గమనార్హం.

Read Also: Samyukta Menon : డైరెక్టర్‎కు పెద్ద గిఫ్ట్ ఇచ్చిన విరూపాక్ష హీరోయిన్

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2023 విజేతలు వీరే..
ఉత్తమ చిత్రంగా గంగూబాయి కథియావాడి సినిమా ఎంపిక కాగా, అదే సినిమాకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడిగా, కథానాయికగా చేసిన అలియా భట్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. బదాయ్ దో సినిమాకు గాను రాజ్‌కుమార్ రావ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అదే సినిమాలో నటించిన షీబీ చద్దా ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది. అలాగే, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్) సంజయ్ మిశ్రా (వధ్), ఉత్తమ నటి (క్రిటిక్స్) టబు (భూల్ భులయా2), భూమి పెడ్నేకర్ (బదాయ్ దో), ఉత్తమ సహాయ నటుడిగా జగ్‌జగ్ జీయో సినిమాకు గాను అనిల్ కపూర్ అవార్డులు అందుకున్నారు.

Read Also:Bottle of Water: నీటి బాటిల్‌కు రూ. 50 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన వాటర్!

‘బ్రహ్మాస్త్ర: శివ’ సినిమాలోని కేసరియా పాటకు గాను అర్జిత్ సింగ్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, అదే పాట రాసిన అమిత్ భట్టాచార్య ఉత్తమ గీత రచయితగా అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఆండ్రియా కెవిచూసా (అనేక్), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్నవాల్ (వధ్) అందుకోగా, ఉత్తమ తొలిచిత్ర నటుడిగా అంకుష్ గీదమ్ (ఝండ్) అవార్డులు అందుకున్నారు. ప్రేమ్ చోప్రా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. జన్వీ శ్రీమంకర్ (దోలాడియా: గంగూబాయి కథియావాడి) ఆర్డీ బర్మన్ అవార్డు అందుకున్నారు.

Show comments