Air Bags in Cars: ప్రయాణికుల భద్రత దృష్ట్యా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వేరియంట్స్, కార్ల ధరలతో సంబంధం లేకుండా ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి, ఇకపై అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కార్లలో భద్రతా ఫీచర్స్‌ని మెరుగుపరిచేందుకు మరిన్ని ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ఆటోమొబైల్స్ ఉత్పత్తిదారులను కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కార్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అవి ముందు ఉంటాయి. అయితే వెనుక ఉండే వారి కోసం మరో నాలుగు ఎయిర్ బ్యాగులు ఉండే విధంగా ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశంలో ఏటా లక్షకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంతో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని గడ్కరీ వెల్లడించారు.
Operation Garuda: ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో అన్ని రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు
ఈ విషయంపై గతంలో రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ప్రపంచ ప్రమాణాలకు తగిన విధంగా తనిఖీలు నిర్వహించి అందుకు తగినట్లుగా ఉన్న వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ఓ కార్యక్రమంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే కార్లలో అదనంగా ఎయిర్ బ్యాగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల కార్ల ధరలు పెరుగుతాయంటూ ఓ వర్గం కార్ల తయారీదారులు సర్కారు దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
