NTV Telugu Site icon

Mangalagiri Gold Theft: గుంటూరులో భారీగా బంగారం దోపిడీ.. 5 కేజీల బంగారం అపహరణ!

Goldprise

Goldprise

గుంటూరు జిల్లా మంగళగిరి మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. దాదాపుగా ఐదు కిలోల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. శనివారం రాత్రి మంగళగిరి మండలం ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు కేజీల 900 బంగారం దోచుకెళ్లారని భాదితుడు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.4 కోట్ల విలువైన బంగారం ఉంటుందని పోలీసులకు తెలిపాడు.

విజయవాడ డీవీఆర్ జ్యూవెలరీ షాపు నుంచి మంగళగిరికి యజమాని రాము బంగారం తీసుకు వస్తున్న క్రమంలో మరో బైక్‌పై వచ్చిన దుండగులు అడ్డుకున్నారు. యజమాని రాముని బెదిరించి బంగారం బ్యాగ్‌ను అపహరించారు. యజమాని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అర్ధరాత్రి పోలీసులు రంగంలోకి దిగి ఘటనాస్థలితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే చోరీ ఆనవాళ్లు కనబడలేదు. కేసు నమోదు చేసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.