టిబెట్ లో భూకంపం వణికించింది. ఆదివారం తెల్లవారుజామున 2:41 గంటలకు (IST) టిబెట్‌ను రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 29.02N అక్షాంశం, 87.48E రేఖాంశం వద్ద, 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read:Hero Vishal: హీరో విశాల్‌కు తీవ్ర అస్వస్థత..! వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన విశాల్..
అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 23, 2025న, టిబెట్ ప్రాంతంలో వరుసగా రెండు ప్రకంపనలు నమోదయ్యాయి. మొదటిది తీవ్రత స్కేలుపై 3.9గా నమోదైంది. సాయంత్రం 6:24 గంటలకు సంభవించింది. రెండవది సాయంత్రం 5:25 గంటలకు చోటు చేసుకోగా రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదైంది. రెండూ 10 కిలోమీటర్ల లోతులో సంభవించాయి.
