గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీ మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను పల్లె వెలుగు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఏడుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మినుము చేను పీకడానికి సుద్ధపల్లి నుండి కంతేరుకు 10 మంది మహిళా కూలీలు ఈరోజు ఉదయం ఆటోలో బయల్దేరారు. చేబ్రోలు మండలం నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య గుంటూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు.. ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు సుద్ధపల్లికి చెందిన అల్లంశెట్టి అరుణ, కుర్రా నాంచారమ్మ, తోట సీతారాములుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.