Site icon NTV Telugu

allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి

01

01

allergy death: అలర్జీతో చనిపోతారని నిజంగా ఎవరూ ఊహించి ఉండరు.. ఇది చెప్తే చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. కానీ ఇక ముందు మీరు నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే నిజంగా ఒకరు అలర్జీతో చనిపోయారు. కేవలం 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో అలర్జీ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. నమ్మలేకుండా ఉన్న ఈ విషయం బ్రెజిల్‌లో వెలుగుచూసింది. అసలు ఏంది ఈ కథ.. నిజంగానే అలర్జీతో చనిపోతారా, ఇంతకీ ఆ అమ్మాయి ఎలా చనిపోయింది.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Free Power Supply: రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి లోకేష్ చొరవ?

బ్రెజిల్‌కు చెందిన 22 ఏళ్ల లెటిసియా పాల్ అనే యువతి న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆమెకు జలుబు, దగ్గు కారణంగా తరచుగా ముక్కు కారేది. అలాగే ఆమెకు వేరుశెనగ, పుప్పొడి, తేనెటీగ కుట్టడం, షెల్ఫిష్ మొదలైన వాటికి అలెర్జీ ఉండేది. అయితే వీటిని ఆమె అస్సలు పట్టించుకునేది కాదు. ఏదైనా సరే ఒక పరిధి దాటిపోయిన తర్వాత పరిస్థితులు చేదాటిపోతాయి. పాపం అచ్చం అలాగే జరిగింది ఈమె జీవితంలో కూడా. ఆగస్టు 20న అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన అలెర్జీ వచ్చింది. ఇక భరించలేమని తెలుసుకొని ఆస్పత్రి బాటపట్టింది. బ్రెజిల్‌లోని రియో ​​డో సుల్‌లోని ఆల్టో వేల్ ప్రాంతీయ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది. వైద్యులు ఆమెకు CT స్కాన్ చేశారు. స్కాన్ చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమెకు తీవ్రమైన అలెర్జీ ఉండటంతో, అనాఫిలాక్టిక్ షాక్ వచ్చింది. దీంతో వెంటనే వైద్యులు ఆమెను ఇంట్యూబేట్ చేసి అత్యవసర చికిత్స కోసం తరలించారు. వైద్య బృందం ఆమెను రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, పాపం ఆమె 24 గంటల్లోపు మరణించింది.

అనాఫిలాక్టిక్ షాక్ అంటే..
అనాఫిలాక్టిక్ షాక్ లేదా అనాఫిలాక్సిస్ అనేది అకస్మాత్తుగా ప్రారంభమయ్యే తీవ్రమైన అలర్జీ అని వైద్యులు పేర్కొన్నారు. ఈసందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. ఇది చాలా తక్కువ సమయంలోనే ప్రాణాంతక స్థితిగా మారుతుంది. ఇది సాధారణ అలర్జీల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు సాధారణ అలర్జీలో తుమ్ములు, ముక్కు మూసుకుపోవడం, తేలికపాటి దురద లక్షణాలు కనిపిస్తాయి. కానీ అనాఫిలాక్సిస్ ఒకేసారి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో శరీర రోగనిరోధక వ్యవస్థ అవసరమైన దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఒక వ్యక్తి వేరుశెనగ, షెల్ఫిష్, ఔషధం, తేనెటీగ కుట్టడం లేదా వైద్య పరీక్షలలో వాడే కాంట్రాస్ట్ డై వంటి అలర్జీని ప్రేరేపించేవి ఎదుర్కొన్నప్పుడు, శరీరం అకస్మాత్తుగా అనేక రసాయనాలను విడుదల చేస్తుంది. వీటిలో హిస్టమైన్ అత్యంత ముఖ్యమైనది. దీని కారణంగా రక్త నాళాలు విస్తరించడంతో పాటు శ్వాసకోశ గొట్టాలు కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. దీంతో ఆ వ్యక్తికి తన గొంతు మూసుకుపోతున్నట్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నట్లు, ఈలలు వేస్తున్నట్లు, అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ టైంలో ఆ వ్యక్తి బ్లడ్‌ఫ్రెజర్ వేగంగా పడిపోవడంతో పాటు, హార్ట్‌బీట్ పెరుగుతుంది. అలాగే పెదవులు, నాలుక, గొంతు వాపు ఒక్కసారిగా ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు చర్మంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు కూడా వస్తాయి. వీటి కారణంగా ఆ వ్యక్తి మూర్ఛపోవచ్చు, వెంటనే ఆయన చికిత్స తీసుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే అనాఫిలాక్సిస్‌ను అత్యవసర వైద్య పరిస్థితిగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో రోగి ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు కాంట్రాస్ట్ ఏజెంట్లను ఉపయోగిస్తారు. దీంతో అనాఫిలాక్సిస్‌తో బాధపడుతున్న రోగి ప్రాణాలను కాపాడవచ్చు.

లెటిసియా పాల్‌కు వైద్య పరీక్షలలో ఉపయోగించే కాంట్రాస్ట్ ఏజెంట్‌కు అలర్జీ ఉంది. ఇది CT స్కాన్ వంటి పరీక్షల సమయంలో శరీరంలోకి ఇంజెక్ట్ చేయబడే ఒక ప్రత్యేక రకమైన ద్రవం. దీని కారణంగా శరీరంలోని అంతర్గత అవయవాలు, రక్త నాళాలు, కణజాలాలను స్పష్టంగా కనిపిస్తాయి. ఇది రక్త ప్రవాహంలో ఏదైనా అవరోధం, కణితి, గడ్డ, ఏదైనా భాగంలో రక్తస్రావం ఉందా అని తెలుసుకోవడానికి డాక్టర్లకు ఉపయోగపడుతుంది. కాంట్రాస్ట్ ఏజెంట్లు సాధారణంగా అయోడిన్ ఆధారితమైనవిగా ఉంటాయి. వాటిని సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. కొన్నిసార్లు నోటి ద్వారా లేదా ఎనిమాగా, పరీక్ష చేసే రకాన్ని బట్టి వాటిని రోగికి ఇస్తారు. చాలా మంది వాటిని సులభంగా తట్టుకుంటారు. కానీ కొన్నిసార్లు ఈ కాంట్రాస్ట్ ఏజెంట్ తీవ్రమైన అలర్జీకి కారణమవుతుంది. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే అలర్జీని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

READ ALSO: Visakhapatnam : విశాఖ భీమిలిలో మైనర్ పై ఆటో డ్రైవర్ అత్యాచారం

Exit mobile version