Bus Collides Truck: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయుధ ట్రక్కును బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 20 మంది మరణించగా.. మరో 60 మంది గాయపడినట్లు లింపోపో ప్రావిన్స్ రవాణా విభాగం మంగళవారం వెల్లడించింది. సోమవారం నగదు రవాణా చేసే ట్రక్కు అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న బస్సును ఢీకొనడంతో ప్రమాదంలో ఇరవై మంది మరణించారని డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.
America: మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.