పంజాబ్ లోని అమృత్‌సర్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి ఏకంగా14 మంది మృతి చెందారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో భంగలి కలాన్, మార్డి కలాన్, జయంతిపూర్ గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read:Gold Rates: షాక్ ఇచ్చిన పసిడి ధరలు.. నేడు మరింత పైపైకి
మద్యం సేవించిన తర్వాత తమ కుటుంబ సభ్యులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారని బాధిత కుటుంబాలు తెలిపాయి. వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ప్రాంతంలో చాలా కాలంగా నకిలీ మద్యం వ్యాపారం జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు. మంగళవారం ఉదయం, డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని బాధిత కుటుంబాలను కలవడానికి వచ్చారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read:NabhaNatesh : నల్లని చీరలో.. తెల్లని బంగారంలా మెరుస్తున్న నభా నటేష్..
కల్తీ మద్యం తాగి మరణించిన ఘటనలో పంజాబ్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. నకిలీ మద్యం రాకెట్ సూత్రధారి ప్రభ్జీత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ చట్టంలోని 105 BNS, 61A సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతానికి చెందిన SSP మణీందర్ సింగ్ తెలిపారు. అరెస్టయిన ఇతర నిందితుల్లో ప్రభజీత్ సోదరుడు కుల్బీర్ సింగ్ అలియాస్ జగ్గు, సాహిబ్ సింగ్ అలియాస్ సరాయ్, గుర్జంత్ సింగ్, నిందర్ కౌర్ ఉన్నారు.
