ఈరోజుల్లో నిజాయితీ, నిబద్ధత పేరుకే గానీ ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఎక్కడో ఒకచోట కొంతమంది తమ నిజాయితీని చాటుకుంటూ ప్రశంసలు అందుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం డోన్ నుంచి వెల్దుర్తికి వెళుతున్న ఆటోను కర్నూలు నుండి డోన్ వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో ప్రయాణిస్తున్న వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి గురైన నలుగురిలో ఒకరు తిమ్మక్కఅక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ముగ్గురు ఆటోడ్రైవర్ అయ్యస్వామి, వెంకటలక్ష్మమ్మ ,మద్దిలేటి అనే వ్యక్తిని 108 అత్యవసర సిబ్బంది చికిత్స అందిస్తూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మద్దిలేటి మృతిచెందాడు.
Shai Hope: సెంచరీ బాదాడు.. కోహ్లీని వెనక్కు నెట్టేశాడు
మిగతా ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.ఆటోడ్రైవర్ అయ్యస్వామి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మార్గమధ్యలో మృతిచెందిన మద్దిలేటికి సంబంధించిన పర్సులో 70 వేల నగదు వుంది. ఆటోడ్రైవర్ అయ్యస్వామికి సంబంధించిన 29,500 రూపాయలు మొత్తం నగదును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో నిజాయితీగా ఆప్పగించి మానవత్వం చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వృత్తిలో ఉండటమేకాక ఎంతో నిజాయితీగా నగదును అప్పగించిన 108 సిబ్బంది సుధాకర్ గౌడ్,చంద్రమౌళిగౌడ్‌ను కర్నూలు GGH డాక్టర్లు, ఆసుపత్రిస్టాఫ్, నర్సులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ రోజుల్లో ఇంత నగదును తిరిగి అప్పగించడం అరుదైన విషయం అంటున్నారు.
Apple Watch Saves Woman Life: యువతి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్