Site icon NTV Telugu

చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కేంద్రం కుట్ర..

చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వ కుట్ర ఉందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైన చంద్రబాబు కళ్లు తెరుచుకోవాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు హర్షకుమార్‌.. ఇప్పటికైనా టీడీపీ, జనసేన పార్టీలు.. ఎన్నికల్లో ఎన్డీఏను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన పిలుపు మేరకు చేపట్టిన బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు మాజీ ఎంపీ హర్షకుమార్‌.

Exit mobile version