Site icon NTV Telugu

UP: యోగి ప్రమాణస్వీకారం అప్పుడేనా..?

ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ త్వరలోనే ప్రమాణం చేయనున్నారు. హోలీ పండగకు ముందే ఆయన ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలంటున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ టెన్యూర్ మే 14 వరకు ఉంది. దీంతో ఆయన ప్రమాణం లేట్ కావొచ్చని భావించారు. అయితే ఈ నెల 14 లేదా 15 తేదీల్లో ప్రమాణ కార్యక్రమం ఉండొచ్చని బీజేపీ వర్గాలు హింట్ ఇచ్చాయి. 2017లో మార్చి 19న ప్రమాణం చేశారు యోగి. ఈ రాత్రికి లేదంటే రేపు ఢిల్లీ వెళ్లనున్నారు యోగి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్ర, శనివారాల్లో గుజరాత్ లో పర్యటించారు. ఆదివారం ఆయన ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. మోడీ ఢిల్లీ రాగానే… యోగి ఆదిత్యానాథ్‌ సమావేశం కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాలతోనూ యోగి సమావేశం కానున్నారు. మంత్రివర్గ కూర్పు, మిత్రపక్షాలకు కేటాయించే శాఖలపై చర్చించనున్నారు.

Read Also: Ukraine Russia War: మేం దిగితే మూడో ప్రపంచ యుద్ధమే..!

Exit mobile version