చనిపోయిన ప్రతి మనిషి తమ అవయవాలను దానం చేస్తే ఈ భూమిపై కొన్ని కోట్ల మందికి ప్రాణదానం చేసినట్టవుతుంది. చనిపోయిన తరువాత బూడిదగా మారేకంటే అవయవాలను దానం చేయడం వలన పది మందికి ఉపయోగపడుతుంది. మనిషి తన శరీరంలోని 200 అవయవాలను దానం చేయవచ్చు. గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, కాళ్లు, చేతులు, కళ్లు, ఎముక మజ్జా ఇలా 200 వరకు అవయవాలను దానం చేయవచ్చు. మనిషి చనిపోతూ మరో మనిషికి బతికించవచ్చే ఆలోచనతో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ను తీసుకొచ్చారు. 1954 వ సంవత్సరంలో రోనాల్డ్ హెన్రిక్ అనే వ్యక్తి తన సోదరుడికి కిడ్నీని దానం చేశాడు. దీనికి సంబందించిన ఆపరేషన్‌ను డాక్టర్ ముర్రే నిర్వహించారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయింది. 1990లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఎంతోమంది ఆవయవాలను దానం చేస్తున్నారు. చిన్నారుల నుంచి ఎవరైనా అవయవాలను దానం చేయవచ్చు. 18 ఏళ్లు లోపున్న పిల్లలు అవయవాలను దానం చేయాలంటే తప్పని సరిగా తల్లిదండ్రుల అనుమతి అవసరం.
Read: పెరుగుతున్న డెల్టాప్లస్ ఏవై3 వేరియంట్ కేసులు… అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక…
