Site icon NTV Telugu

Viral Video: పానీపూరి కోసం నోరు తెరిచిన మహిళ.. పట్టుకున్న దవడ కండరాలు

Untitled Design (1)

Untitled Design (1)

పానీపూరి తినేందుకు వెళ్లిన ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. పానీపూరి తినేందుకు నోరు తెరిచిన మహిళ నోరు మూసుకోకుండా అలానే ఉండిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో చోటుచేసుకుంది.పానీపూరి తింటున్న సమయంలో ఒక మహిళ తన నోరు మామూలుగా తెరిచింది.. ఈ క్రమంలో ఆమె దవడ అకస్మాత్తుగా లాక్ అయి, నోరు మూసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… ఔరయ్యాలోని ఒక పానీపూరి షాపుకు వచ్చిన మహిళ పూరి తినే సమయంలో నోటిని సాధారణం కంటే ఎక్కువగా తెరిచింది. ఈ సమయంలో ఆమె దవడ జాయింట్ డిస్లోకేట్‌ అవడంతో నోరు బిగుసుకుపోయి మూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్ర అసౌకర్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

డాక్టర్లు పరిశీలించిన తర్వాత ఇది జా డిస్లోకేషన్ కేసు అని గుర్తించారు. వెంటనే ప్రత్యేక మాన్యువల్ టెక్నిక్‌ ఉపయోగించి ఆమె దవడను తిరిగి సరైన స్థానంలోకి సెట్ చేశారు. కొంతసేపు పరిస్థితిని పరిశీలించిన అనంతరం, ఆమె కోలుకుంటున్నట్టు నిర్ధారించిన డాక్టర్లు కొన్ని సూచనలు అందజేశారు.

అయితే డాక్టర్లు ఆమెకు కొన్ని సూచనలు చేశారు. కొంతకాలం పాటు కఠినమైన ఆహారం తీసుకోకూడదని, నోటని ఎక్కువగా తెరవకూడదని, పెద్దగా నవ్వడం, విపరీతమైన ముఖ కదలికలు చేయకూడదన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version