NTV Telugu Site icon

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంలో పూజారిగా యూపీ విద్యార్థి..ఎవరీ మోహిత్ పాండే..?

Mohit Pandey

Mohit Pandey

Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22 శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా జరగబోతోంది. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే గర్భగుడిని నిన్న ఆలయ ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది. ఇదిలా ఉంటే రామమందిరంలో పూజారులుగా పనిచేయడానికి ఎంపికైన 50 మందిలో ఘజియాబాద్‌కి చెందిన యువకుడు మోహిత్ పాండే ఎంపికయ్యారు.దూధేశ్వర్ వేద విద్యాపీఠంలో ఏడేళ్ల చదివిన తర్వాత మోహిత్ పాండే తిరుపతి వెళ్లి వేద విద్యను అభ్యసించారు. ఇతరుల అర్చకులతో పాటు నియామకానికి ముందు ఆరు నెలల శిక్షణ తీసుకోనున్నారు.

సామవేదం చదువుకున్న మోహిత్ పాండే తిరుపతిలోని వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రస్తుతం ఆయన పీహెచ్డీకి సిద్ధమయ్యారు.మోహిత్ ఏడేళ్లుగా దూధేవ్వర్ వేద్ విద్యాపీఠంలో మతం, ఆచారాలపై అధ్యయనం చేశారు. 23 ఏళ్లుగా ఇక్కడ వేద బోధనను స్వీకరిస్తున్నారు. రామమందిరంలో పూజారిగా ఎంపిక కావడంతో నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు. స్థానికులు, బంధువుల నుంచి అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Allahabad High Court: భార్య ఇష్టంతో పనిలేదు.. వైవాహిక అత్యాచారం నేరంకాదు.. హైకోర్టు

వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రానున్నారు. మోడీతో పాటు దేశంలోని రాజకీయ నాయకులతో పాటు 3000 మంది వీవీఐపీలో సహా 7000 మంది అతిథులను ఆహ్వానించేందుకు శ్రీ రామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ సిద్ధమైంది. రామ జన్మభూమి ఆలయంలో ప్రతిష్టించేందుకు అయోధ్యలోని మూడు ప్రదేశాల్లో రాముడి విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. ముగ్గురు కళాకారులు మూడు వేర్వేరు రాళ్లతో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాల తయారీ 90 శాతం పూర్తైందని, ఫినిషింగ్ వర్క్ పూర్తి కావడానికి వారం రోజులు పట్టనుంది. రాముడి ప్రతిష్టా వేడుకల కోసం తరలివచ్చే వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి అధికారులు అయోధ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట సమయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు రామాలయ గర్భగుడిలో పూజలు నిర్వహిస్తారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.