ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తే.. ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి..? ప‌్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటూ సర్వే నిర్వహించిన ఇండియాటుడే.. భారత దేశానికి ప్రధానిగా ఎవరు సరిపోతారు?
కాబోయే ప్రధాని ఎవరు అయితే బెటర్ అంటూ మరో అంశంపై కూడా సర్వే చేసింది.. మూడ్ ఆఫ్ ది నేషన్ 2022 పేరుతో జరిగిన ఈ సర్వేలో.. టాప్ 4లో నిలిచిన నలుగురి పేర్లను వెల్లడిస్తూ.. వారికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని తెలిపింది.. ఈ సర్వే ప్రకారం.. భారత దేశానికి మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీయే కావాలని కోరుకుంటున్నారు ప్రజలు.. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, యోగి ఆదిత్యానాథ్, అమిత్‌షా పేర్లను ప్రస్తావించింది.. మూడ్ ఆఫ్ ది నేషన్ 2022 సర్వేలో 53 శాతం మంది తదుపరి ప్రధానిగా నరేంద్ర మోడీయే బెటర్ అని అభిప్రాయపడ్డారు.. ఇక, ఏడు శాతం మంది రాహుల్ గాంధీకి ఓటేశారు.. ఆ తర్వాతి స్థానంలో 6 శాతం మంది యోగి ఆదిత్యానాథ్‌కు మొగ్గుచూపగా.. 4 శాతం మంది అమిత్‌షా కు ఓటు వేశారు.