Site icon NTV Telugu

డెల్టా ప్ల‌స్ తీవ్ర‌త ఎంత‌?  మూడో వేవ్‌కు అదే కార‌ణ‌మౌతుందా?

దేశంలో సెకండ్ వేవ్ కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్ ఇప్పుడు మ్యూటేష‌న్ చెంది డెల్టాప్ల‌స్ వేరియంట్‌గా మారింది.  ఈ వేరియంట్‌కు చెందిన కేసులు దేశంలో న‌మోద‌వుతున్నాయి.  ఇప్ప‌టికే 40కి పైగా కేసులు న‌మోద‌య్యాయి.  డెల్టా వేరియంట్ మాదిరిగా వేగంగా వ్యాప్తి చెంద‌డం, ద‌క్షిణాఫ్రికా వేరియంట్ మాదిరిగా టీకాల నుంచి త‌ప్పించుకునే ల‌క్ష‌ణం క‌లిగి ఉండ‌టంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  

Read: అమితాబ్ ‘బిస్కెట్’ ఆఫర్ ని అడ్డంగా తిరస్కరించిన దర్శకుడు!

ఈ కేసులకు సంబందించి ఇప్ప‌టికే ఒక మ‌ర‌ణం సంభ‌వించ‌డంతో దేశం మ‌రింత అప్ర‌మ‌త్తం అయింది.  వేగంగా వ్యాపించ‌డంతో పాటు, ఊపిరితిత్తుల‌కు బ‌లంగా అతుక్కొని ఉండ‌టం, మోనోక్లోనాల్ వంటి యాంటీబాడిల చికిత్స‌కు లొంగ‌కుండా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుండ‌టంతో దీనిపై విస్తృత‌మైన ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు ఐసీఎంఆర్‌, ఎన్ఐవీ శాస్త్ర‌వేత్త‌లు.  చికిత్సకు లొంగ‌కుండా, వేగంగా వ్యాపించే ల‌క్షణం క‌లిగి ఉంటే, మూడో వేవ్‌కు కార‌ణం కావొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version