Site icon NTV Telugu

పెట్రో ధ‌ర‌లు త‌గ్గించాల్సిందే.. భార‌తీయుల డిమాండ్…!

Nirmala Sitharaman

Nirmala Sitharaman

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ తొలి విడ‌త స‌మావేశాలు ఇవాళే ప్రారంభం అయ్యాయి.. రేపు 2022-23 వార్షిక బ‌డ్జెట్‌ను మంగ‌ళ‌వారం రోజు పార్ల‌మెంట్ ముందుకు రాబోతోంది.. లోక్‌స‌భ‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. అయితే, ప్రీ బడ్జెట్‌ డిమాండ్స్‌ పేరుతో ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ ఒక నివేదిక విడుదల చేసింది.. బ‌డ్జెట్ ఎలా ఉండాల‌ని భార‌తీయులు కోరుకుంటున్నారు..? అనే దానిపై అధ్య‌య‌నం నిర్వ‌హించిన ఆ సంస్థ‌.. తాజాగా, నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టింది.. అయితే, ద్రవ్య స్థిరీకరణ ఆలస్యమైనా ఫర్వాలేదు, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు, వినియోగ డిమాండ్‌కు మద్దతుగా ఆదాయపన్ను, ఇంధన పన్ను భారం తగ్గించడంపై దృష్టి పెట్టాల‌ని ఆ నివేదిక సూచించింది.

ప్రీ బడ్జెట్‌ డిమాండ్స్‌ పేరుతో విడుద‌లైన ఆ నివేదిక‌లో.. బ‌డ్జెట్‌లో కొత్తవి కాకుండా, గత బడ్జెట్‌లో ప్రకటించిన వాటి స్థిరీకరణపై స‌ర్కార్ ఫోక‌స్ పెట్టాల‌ని అంచ‌నా వేసింది.. కరోనా మ‌హ‌మ్మారితో తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఉపాధి కల్పన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.. ఇక‌, ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ద్రవ్యలోటు స్థిరీకరణ విషయంలో ప్ర‌భుత్వం కాస్త నెమ్మ‌దిగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ఆర్థిక వ్యవస్థకు కావాల్సినంత మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి కృషి చేయాల‌ని సూచించింది ఆ నివేదిక‌. ఆ నివేదిక‌లోని ముఖ్య‌మైన అంశాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌జ‌ల‌ ఆర్థిక పరిస్థితులపై కరోనా మ‌హ‌మ్మారి ప్రతికూల ప్రభావం చూపింది.. కావున‌, ఆదాయపన్ను ఉపశమనాలు, ఇంధనాలపై పన్నుల తగ్గింపు రూపంలో మద్దతుగా ఇవ్వాల‌ని కోరింది.. ఇక‌, అధిక పెట్రో ధరలు ద్రవ్యోల్బణానికీ కారణమవుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల మేర వ్యయాలను పెంచినా.. ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్ష డిమాండ్‌ ఎందుకు పెరగలేదన్నది ఆర్థిక శాఖ విశ్లేషించుకోవాల‌ని.. అవసరమైన రంగాలకు ప్రభుత్వ మద్దతు ఇప్పటికీ అవసరం ఉందని పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు మరింత ఆచరణాత్మకంగా ఉండాల‌ని సూచించింది..

Exit mobile version