Site icon NTV Telugu

West Bengal: భర్తలకు విడాకులిచ్చి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు..

Untitled Design (8)

Untitled Design (8)

పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘటన జరిగింది. సాధారణం పెళ్లి అనేది.. అమ్మాయికి , అబ్బాయికి జరుగుతుంది.. లేదా.. లెస్బియన్స్ దగ్గరవడం చేస్తుంటారు. కొత్తగా ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కూడా. ఇలాంటి సంఘటనే ఇక్కడ ఒకటి జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో వింత కథ వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన తర్వాత భర్తలకు విడాకులు ఇచ్చి.. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకున్నారు. ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మూడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ తో పరిచయమైన ఈ ఇద్దరు మహిళలు.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బీర్భూమ్‌లోని ఓ శివాలయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా కొందరు కంగ్రాట్స్ చెప్తున్నారు. శక్తి, సాంప్రదయాలను ధిక్కరించగల ధైర్యాన్ని పొగుడుతున్నారు. కానీ చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే మానవాళికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు కొందరు పెద్దలు.

Exit mobile version