NTV Telugu Site icon

Shivraj Chouhan: మేము “కృ‌ష్ణుడిని” గుర్తుంచుకుంటే, రాహుల్ గాంధీ “శకుని” గురించి ఆలోచిస్తున్నాడు..

Shivraj Chouhan

Shivraj Chouhan

Shivraj Chouhan: రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారతాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. శుక్రవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ అతను (రాహుల్ గాంధీ) శకుడి పాచికల చక్రవ్యూహాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇవన్నీ అధర్మంతో మడిపడి ఉన్నాయి. శకుని మోసం, ద్రోహానికి ప్రతీక. కాంగ్రెస్ ఎప్పుడూ వీటినే ఎందుకు ఆలోచిస్తోంది..?’’ అంటూ రాజ్యసభలో వ్యాఖ్యానించారు.

Read Also: Malvi Malhotra: రాజ్ తరుణ్ కి మాల్వీ మల్హోత్రా వార్నింగ్.. ఏంటో తెలుసా?

బీజేపీ మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించి ఇలోచిస్తుందని శివరాజ్ చౌహాన్ విమర్శిస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశాన్ని ఆరుగురు వ్యక్తులు ‘‘చక్రవ్యూహం’’లో బంధించిందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ‘‘వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో అభిమన్యుని ఆరుగురు వ్యక్తులు ‘చక్రవ్యూహం’లో బంధించి చంపారు, ‘చక్రవ్యూహాన్ని’ ‘పద్మవ్యూహ్’ అని కూడా అంటారు, అంటే ‘కమలంగా ఏర్పడటం’. చక్రవ్యూహం కమలం ఆకారంలో ఉంది’’ అంటూ వ్యాఖ్యానించారు.

‘‘ అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తలు చంపారు. ఈ రోజు నేను కూడా పద్మవ్యూహంలో ఆరుగురు మధ్యలో ఉన్నారు. వారు నరేంద్ర మోడీ, (కేంద్ర హోం మంత్రి) అమిత్ షా, (ఆర్ఎస్ఎస్ చీఫ్) మోహన్ భగవత్, (జాతీయ భద్రతా సలహాదారు) అజిత్ దోవల్, అంబానీ, అదానీ’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. ఈ వ్యాఖ్యలు అధికారంలో ఉన్న కొందరకి నచ్చలేదని, దీంతో తనపై ఈడీ దాడి జరిగే అవకాశం ఉందని ఈ రోజు రాహుల్ గాంధీ అన్నారు.

Show comments