TMC vs BJP Tensions: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. బీజేపీ నాయకుడు సువేందు అధికారి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇవాళ (ఆగస్టు 5న) కూచ్ బెహార్‌లో నిర్వహించిన ర్యాలీలో సువేందు పాల్గొన్నారు. అయితే, రాష్ట్రంలో మహిళలపై హింస, నేరాలు పెరుగుతున్న క్రమంలో టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలను ఎస్పీకి సమర్పించేందుకు ర్యాలీగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: MG Hector, Astor: ఎంజీ కళ్లు చెదిరే ఆఫర్స్.. ఆ మోడల్స్ పై రూ. 2.30 లక్షల డిస్కౌంట్
అయితే, ఖగ్రాబారి ఏరియాలో కమలం నేత కాన్వాయ్ వెళ్తున్న సమయంలో నల్ల జెండాలు పట్టుకున్న గోబ్యాక్ అంటూ నిరసన కారులు పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. ఆయన వెహికిల్ పై చెప్పులు కూడా విసిరారు. ఈ దాడుల్లో పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలోనే సువేందు అధికార ప్రభుత్వానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, రాజకీయ లబ్ధి కోసమే కమలం పార్టీ పక్కా ప్లాన్ ప్రకారం ఆడుతున్న రాజకీయ డ్రామాగా అని తృణమూల్ నేతలు విమర్శించారు. ఈ దాడితో రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.
