Uttarkashi tunnel collapse: ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ కుప్పకూలిన ఘటనలో అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్య్కూ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. విదేశీ నిపుణలతో పాటు ఎన్డీఎంఏ, ఇతర ఏజెన్సీలు గత 12 రోజులుగా వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వారి ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 52 మీటర్లు దూరంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు మరో 10 మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే సరిపోతుంది. వారిని విజయవంతంగా బయటకు తీసుకురావచ్చు. తాము మిమ్మల్ని రక్షించే పనుల్లో దగ్గరకు వచ్చామని కార్మికులకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఉత్తరకాశీ సొరంగం వద్దకు స్థానిక గ్రామస్తులు దేవతామూర్తులను పల్లకిలో అక్కడికి తీసుకువచ్చారు. టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుపోయినప్పటి నుంచి స్థానికంగా ఉన్న ప్రజలు వారిని రక్షించాలంటూ దేవతలను ప్రార్థిస్తున్నారు. ఈ రోజు డోలీలో దేవీదేవతలను సొరంగం ఉన్న ప్రాంతానికి తీసుకువచ్చారు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) అధికారి లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ గురువారం మాట్లాడుతూ.. 41 మందిని రక్షించడానికి డ్రిల్లింగ్ పనులు మరో రెండు గంటల్లో పూర్తవుతాయని, కార్మికులు, రెస్క్యూటీం ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారని అన్నారు. కార్మికులను చేరుకోవాలంటే మొత్తం 57 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటే ప్రస్తుతం 47 మీటర్ల లోతు వరకు పనులు పూర్తయ్యాయి.
కార్మికుల చికిత్స కోసం ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలంలో అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి, వీరికి చికిత్స అందించేందుకు 41 బెడ్లలో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. నవంబర్ 12న సిల్క్యారా సొరంగం కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఉత్తర కాశీ జిల్లాలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు.
#WATCH | Locals bring the 'doli' of the local deity to the Silkyara tunnel in Uttarkashi, where an operation is underway to rescue 41 trapped workers pic.twitter.com/MJPasqUMob
— ANI (@ANI) November 23, 2023