తమిళ సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు.. తీవ్ర అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు.. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో డీఎండీకే కీలక నేతల్లో ఆందోళన నెలకొంది.. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత భుజాన వేసుకుంది..
ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు.. ఆయనకు చికిత్స కొనసాగుతుంది.. ఆయనను అలా చూసిన పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది..
ఆ సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మొదలయ్యాయి.. ఇందుకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించారు. ఆయన రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు చెప్పుకొచ్చారు..