Site icon NTV Telugu

Vande Bharat Train: సెప్టెంబర్ 30న వందే భారత్ 2 ట్రైన్ ప్రారంభం.. వీబీ2 టాప్ స్పీడెంతో తెలుసా..?

Vande Bharat Train

Vande Bharat Train

Vande Bharat 2 Train start on sep 30: దేశంలో రైల్వేలను మరింత ఆధునీకీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైళ్లలో సౌకర్యాలతో పాటు ప్రజల కంఫర్ట్ ప్రధానంగా కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే దేశంలో అత్యంత స్పీడుగా ప్రయాణించే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. తాజాగా వందే భారత్ 2(వీబీ2) రైళ్లు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ హై స్పీడు రైలు 20 రోజుల ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. రైల్వే సేఫ్టీ కమిషనర్( సీఆర్ఎస్) ఈ రైలుకు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 30న వీబీ2 రైలును ప్రధాన నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Krishnam Raju: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి, సంతాపం

దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా వందేభారత్ ట్రైన్ కు పేరుంది. ప్రస్తుతం రాబోతున్న వందే భారత్ 2 ట్రైన్ గతంలో దాని కన్నా మెరుగైన ఫీచర్లతో పాటు మరింత వేగంతో ప్రయాణించనుంది. వీబీ 2 రైలు 52 సెకన్లలో గంటలకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుందని రైల్వే శాఖ మంత్ర అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గతంలో వీబీ1 54.2 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేది. ప్రస్తుతం రాబోతున్న వీబీ2 రైలు గరిష్ట వేగం గంటలకు 180 కిలోమీటర్లు కాగా.. వీబీ1 వేగం గంటలకు 160 కిలోమీటర్లుగా ఉండేదని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం రాబోతున్న వీబీ2 రైలు ముంబై, అహ్మదాబాద్ మధ్య నడిచే అవకాశం ఉంది. ఈ రైలు తయారీని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఆగస్టు 12 ప్రారంభించారు. గతంలో ఉన్న వీబీ1 రైళ్లతో పోలిస్తే వీబీ2లో మరన్ని ఫీచర్లు రాబోతున్నాయి. ఆన్ బోర్డ్ వైఫై, పెద్ద ఎల్సీడీ టీవీలు, డస్ట్ ఫ్రీ క్లీన్ ఎసీలు, ఎయిర్ ప్యూరిఫయర్స్, రిక్లైనర్ సీట్లు, స్లీపర్ క్లాస్, ఆటోమెటిక్ డోర్లు, వికలాంగులకు అనుకూలమైన టాయిలెట్లు ఇలా అధునాతన ఫీచర్లను తీసుకువచ్చారు.

Exit mobile version