NTV Telugu Site icon

ఉత్తరాఖండ్‌ సీఎం రాజీనామా… కారణం ఇదే..!

Tirath Singh Rawat

Tirath Singh Rawat

ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌ సింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు.. గత మార్చిలో సీఎంగా ప్రమాణం చేసిన రావత్.. సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నిక కావాల్సి ఉంది… ఆయన ప్రస్తుతం లోక్‌సభ సభ్యులు.. అయితే, కరోనా కారణంగా సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.. మరోవైపు ఉత్తారాఖండ్‌ అసెంబ్లీలోకి వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగాల్సి ఉంది.. అసెంబ్లీకి ఏడాదిలో ఎన్నికలు ఉంటే.. ఉప ఎన్నిక నిర్వహించరాదనే నిబంధన ఉంది.. దీంతో.. రావత్‌.. అసెంబ్లీకి ఎన్నికయ్యే ఛాన్స్‌ లేకపోవడంతో ఇవాళ రాజీనామా చేశారు. రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్‌ రాజీనామా చేసిటన్టుగా తెలుస్తోంది.. హల్ద్వానీ, గంగోత్రి శాసన సభ స్థానాలు ఖాళీగానే ఉన్నప్పటికీ, ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలు కనిపించడం లేకపోవడంతో.. తప్పుకోవడమే సరైన నిర్ణయమని చెప్పినట్లు సమాచారం. దీంతో తీరత్‌ సింగ్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా తీరత్‌ సింగ్‌ రావత్‌ ప్రస్తుతం పౌరీ గర్వాల్‌ నుంచి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.