Site icon NTV Telugu

Urfi Javed: బీజేపీ నేత వార్నింగ్.. ప్రాణ హాని ఉందంటూ ఉర్ఫీ ఫిర్యాదు

Urfi Javed

Urfi Javed

Urfi Javed Filed Complaint On BJP Leader Chitra Kishor Wagh: ఉర్ఫీ జావెద్.. పరిచయం అక్కర్లేని పేరు. చిట్టిపొట్టి దుస్తులతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటుంది. సాధారణంగా ఏ సెలెబ్రిటీ అయినా అందమైన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. కానీ.. ఉర్ఫీ జావెద్ అందుకు పూర్తి భిన్నం. ఆమెపై దుస్తులు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన పరిస్థితి. అందుకే.. ఎప్పుడూ ఈ అమ్మడు లైమ్‌లైట్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు ఈమె దుస్తులపై వివాదాలూ చెలరేగాయి. ఇప్పుడు ఓ వివాదం మరింత ముదిరింది. బీజేపీ మహిళా నేత చిత్ర కిషోర్ వాఘ్ తన దుస్తులపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉర్ఫీ మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది.

Nithyananda : కైలాస అధిపతి నిత్యానందకు వరమిచ్చిన అమెరికా

అసలేం జరిగిందంటే.. బీజేపీ నేత చిత్ర కిషోర్ వాఘ్ జనవరి 4వ తేదీన ఉర్ఫి జావేద్‌ దుస్తులపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఈరోజుల్లో కొందరు మహిళలు అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతున్నారని, ఇది మహారాష్ట్ర సంస్కృతిని దెబ్బతీస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఉర్ఫీ జావెద్ అయితే మరీ దారుణంగా వ్యవహరిస్తోందని, అసభ్యకరంగా దుస్తులు ధరిస్తూ నడివీధుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మహిళా కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదని, ఆమె డ్రెస్సింగ్‌పై మ‌హిళా క‌మిష‌న్ ఏమైనా చేస్తుందా అని ఆమె ప్రశ్నించారు. తాను కేవలం ఉర్ఫీ జావెద్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, బహిరంగ ప్రదేశాల్లో అర్ధనగ్నంగా తిరిగి ప్రతీ మహిళను ఉద్దేశించి చెప్తున్నానన్నారు. ఛత్రిపతి శివాజీ మహారాజా జన్మించిన మహారాష్ట్రలో ఇలాంటి అర్ధనగ్న ప్రదర్శనలు చేసేవారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు.

Sania Mirza: సానియా మీర్జా సంచలన నిర్ణయం.. టెన్నిస్‌కి వీడ్కోలు

ఈ విధంగా చిత్ర కిషోర్ చేసిన వ్యాఖ్యాలపై ఉర్ఫీ జావెద్ మహిళా కమిషన్ ఆశ్రయించింది. తను ధరించే దుస్తులపై చిత్ర అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఉర్ఫీ తరఫు న్యాయవాది నితిన్‌ సత్పుటే మాట్లాడుతూ.. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న నటిపై బెదిరింపులకు పాల్పడినందుకు, వాఘ్‌పై ఫిర్యాదు నమోదైందని తెలిపారు. ఆ నేతపై ఐపీసీ సెక్షన్‌ U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద ఫిర్యాదు చేశామని.. మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రుపాలీ చకంకర్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అలాగే చిత్ర వాఘే వ్యాఖ్యల అతనంరం నటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు రక్షణ కల్పించాలని కోరానని నితిన్ పేర్కొన్నారు.

Exit mobile version