NTV Telugu Site icon

విద్యార్థులకు శుభవార్త

హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ప్రారంభించిన UPSC
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) SC/ST/OBC/EWS/PWBD కేటగిరీకి చెందిన అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ప్రారంభించింది. ఇకనుంచి ఏ పరీక్షా లేదా రిక్రూట్‌మెంట్‌ సంబంధిత విషయాలు తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నెంబర్‌1800118711లో ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.

కమిషన్‌ పరీక్షలు, రిక్రూట్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్న ఇతర అభ్యర్థులు సైతం తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ అన్ని పనిదినాలలో పనిచేస్తుంది. కమిషన్‌ జారీ చేసిన ఏదైనా పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ద్వారా లేదా UPSC అధికారిక సైట్‌ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.