Viral Video: ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురి సమీపంలోని కొత్వాలి ప్రాంతంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. ఓ గణేశ్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హనుమంతుడి వేషదారణలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉన్న రవి శర్మ(35) అనే వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలి.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు ఎంతో హుషారుగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేసిన వ్యక్తి మండపంలోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల భక్తులు షాక్‌కు గురయ్యారు.
CM K Chandrashekar Rao: ప్రగతిభవన్‌లో గణనాథుడికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
భజనకు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న రవివర్మ.. కొంతసేపటి తర్వాత ఆ మండపంపై భక్తులు కూర్చొన్న చోట బోర్లాపడిపోయాడు. అయితే ఇదంతా భజన, డ్యాన్స్‌లో భాగంగా అంతా అనుకున్నారు. కాగా, హనుమంతుడు వేషం వేసిన రవి శర్మ చాలా సేపటి వరకు పైకి లేవలేదు. గమనించిన మండపం నిర్వాహకులు అతడ్ని వెంటనే మెయిన్‌పురి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఆ గణేష్ మండపంలో విషాదాన్ని నింపింది. మరోవైపు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
हनुमान जी का किरदार निभा रहे रवि शर्मा #मैनपुरी में गणेश पंडाल में नाच रहे थे
अचानक ज़मीन पर गिरे…..
जिला अस्पताल में डॉक्टर ने रवि को मृत घोषित कर दिया
जीवन में इससे बड़ी अनिश्चितता तो कुछ भी नहीं pic.twitter.com/cAaZTUDG7l
— Khanzar Sutra 'खंजर सूत्र' (@khanzarsutra) September 4, 2022