Site icon NTV Telugu

Up 6th Phase Elections: యూపీలో ఆరవ విడత ఎన్నికలు ప్రారంభం

ఇవాళ యూపీలో ఆరవ విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడవ విడతలో మార్చి 7 న మిగిలిన 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.ఇవాళ10 జిల్లాల్లో 57 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2017 ఎన్నికల్లో 57 స్థానాల్లో 46 స్థానాల్లో బిజేపి గెలిచింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు 292 స్థానాల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. ఉత్తర్ ప్రదేశ్ లో కీలకమైన పూర్వాంచల్ ప్రాంతంలోని 111 అసెంబ్లీ స్థానాలపైనే అందరి దృష్టి పడింది.

అంబేద్కర్ నగర్, బలరాంపూర్, సిధ్దార్ద్ నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, మహరాజ్ గంజ్, గోరఖ్ పూర్, డియోరియా, కుషీ నగర్, బల్లియా జిల్లాల్లోని 57 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. ఎమ్.ఎల్.సి గా ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తొలిసారిగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గోరఖ్ పూర్ లోకసభ స్థానం నుంచి 5 సార్లు ఎమ్.పిగా ఎన్నికైన యోగి ఆదిత్యనాధ్, ఈ సారి గోరఖ్ పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా పోటీలో వున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బిజేపి అభ్యర్థిగా రాధా మోహన్ దాసు అగర్వాల్ 60 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచారు.

గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ పోటీ చేస్తుండడంతో, గోరఖ్ పూర్ లోకసభ స్థానం పరిధిలోని మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లోనూ భారీ మెజారిటీ తో బీజేపి గెలుపు పై అంచనాలు భారీగా వున్నాయి. 2017 ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాల్లో బీజేపి గెలిచింది. ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా సమాజ్ వాది పార్టీ అభ్యర్గిగా బిజేపి మాజీ నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా భార్య పోటీ చేస్తున్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా గోరఖ్ పూర్ స్థానం నుంచి పోటీలో వున్నారు. ఈ విడత లో సుమారు 30 అసెంబ్లీ స్థానాల్లో
ఇతర వెనుకబడిన కులాలు, బాగా వెనుకబడిన కులాలదే ప్రభావం ఎక్కువ.

నిషాద్” పార్టీ తో పొత్తు ఉన్నందున ఈ విడతలో బలమైన “మల్లా” ( పడవ నడిపే సామాజిక వర్గం) సామాజిక వర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తుంది బీజేపీ. అధిక స్థానాల్లో గెలుపు సాధ్యమనే అంచనాల్లో బీజేపి. ఈ విడతలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తో పాటు తంకుహి రాజ్” స్థానం నుంచి యుపి కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ పోటీ చేస్తున్నారు. “బన్స్ ది” స్థానం నుంచి ప్రతిపక్ష సమాజ్ వాది పార్టీ నాయుకుడు రాం గోవింద్ చౌధురి పోటీ లో వున్నారు. ఫజిల్ నగర్ నుంచి సమాజ్ వాది పార్టీ కి చెందిన మరో ముఖ్య నేత స్వామి ప్రసాద్ మౌర్య పోటీ చేస్తుండగా ఈ విడతలో పలువురు మంత్రులు తమ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు—- “పత్తర్ దేవ” స్థానం నుంచి సూర్య ప్రతాప్ షాహి, ఇటావా నుంచి సతీశ్ చంద్ర ద్వివేది, బన్సి స్థానం నుంచి జయ ప్రతాప్ సింగ్, ఖజాని స్థానం నుంచి శ్రీరామ్ చౌహాన్, రుద్రాపూర్ స్థానం నుంచి జయప్రకాష్ నిషాద్ పోటీలో వున్నారు.

Exit mobile version