Site icon NTV Telugu

Hardeep Singh Puri: రష్యా నుంచి ఆయిల్ కొంటాం.. పాశ్చాత్య మీడియాకు కేంద్రమంత్రి దిమ్మతిరిగే సమాధానం

Union Minister Hardeep Singh Puri

Union Minister Hardeep Singh Puri

Union minister snubs journalist on India’s Russian oil purchase: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కొనుగోళ్లపై భారత్ కు రష్యా డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ ధరకే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది ఇండియా. ఇదిలా ఉంటే భారత్ ఈ చర్యపై యూరోపియన్ దేశాలు, అమెరికా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడి మీడియా భారత చర్యను తప్పుపడుతోంది. భారత్ కన్నా యూరోపియన్ దేశాలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మరిచిపోయి భారత్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సీఎన్ఎన్ రిపోర్టర్ బెక్కీ అండర్సన్ ఈ ఇంటర్య్వూలోని కొంత భాగాన్ని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెస్ట్రన్ మీడియాకు రష్యా నుంచి ఆయిల్ దిగుమతిపై దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. సీఎన్ఎన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను తప్పు పట్టారు పూరీ. భారతదేశం కొనుగోళ్లను సమర్థించారు కేంద్ర మంత్రి. భారతదేశం కేవలం 0.2 శాతం చమురును మాత్రమే రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది.. ఇది 2 శాతం కాదని సమాధానం ఇచ్చారు. యూరప్ దేశాలు మధ్యాహ్నంలోపు ఉపయోగించే చమురులో నాలుగో వంతును మాత్రమే భారత్ కొనుగోలు చేస్తోందని ఆయన వెల్లడించారు. భారత్ జనభా 130 కోట్లని గుర్తు చేశారు. ముందుగా మీ దృక్పథాన్ని సరిదిద్దుకోండని సదురు జర్నలిస్టుకు సూచించారు.

Read Also: Go Back Modi: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న “గో బ్యాక్ మోదీ”

భారత్ కు అతిపెద్ద చమురు సరఫరదారు రష్యా కాదని.. ఇరాక్ అని హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. మా దేశ వినియోగదారుల పట్ల మాకు నైతిక బాధ్యత ఉందని.. వారికి పెట్రోల్, డిజిల్ సరఫరా అయ్యేలా మేం చూసుకోవాలని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపిసేందుకు భారత్ కు ఎలాంటి నైతిక అడ్డంకులు లేవని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, యూరప్ దేశాలతో భారత్ ఆరోగ్యకరమైన చర్చలను కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడిని అనుభవించదని.. మేము ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

సెప్టెంబర్ నెలలో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 19 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నెల నుంచి 50 రెట్లు పెరిగిందని రాయిటర్స్ వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకపోతే ఇండియాలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయని.. ఇది ద్రవ్యోల్భనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులకు దారి తీస్తుందని ఆయన అన్నారు. జీ-7 దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నాయని జర్నలిస్టు ప్రశ్నించడంపై.. పూరీ స్పందించడానికి నిరాకరించారు.

Exit mobile version