Site icon NTV Telugu

ఒవైసీపై కేంద్రమంత్రి ఫైర్.. ఆయన్ను ఆఫ్ఘన్‌కి పంపిస్తే బెటర్..!

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ నాయ‌కురాలు, కేంద్రమంత్రి శోభా క‌రాంద్ల‌జే… దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి 9 మందిలో ఒక‌రు మరణిస్తున్నారని వ్యాఖ్యానించిన ఒవైసీ.. ఇక, మ‌హిళ‌ల‌పై వేధింపులు, నేరాలు పెరుగుతున్నాయ‌ని.. కానీ, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మాత్రం ఆఫ్ఘనిస్థాన్‌లో మ‌హిళ‌ల దుస్థితిపై ఆందోళ‌న వ్యక్తంచేయ‌డం విడ్డూరంగా ఉందంటూ కామెంట్‌ చేశారు.. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన కేంద్రమంత్రి.. మ‌హిళ‌ల‌పై వేధింపుల విష‌యంలో భార‌త్‌ను ఆఫ్ఘనిస్థాన్‌తో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. అస‌దుద్దీన్ ఓవైసీని ఆఫ్ఘనిస్థాన్‌కు పంపించ‌డం ఉత్తమ‌మ‌ని, అక్కడ ఆయ‌న వాళ్ల స‌మాజానికి, మ‌హిళ‌ల‌కు ర‌క్షణ క‌ల్పిస్తారు అంటూ సెటైర్లు వేశారు క‌రాంద్ల‌జే.

Exit mobile version