Site icon NTV Telugu

పూరైన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ క‌స‌ర‌త్తు… వీరికి అవ‌కాశం…!!

కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌కు సంబందించిన క‌స‌ర‌త్తు పూర్త‌యింది.  వారం రోజులకు పైగా విస్త‌ర‌ణ‌కు సంబందించి వివిధ రాష్ట్రాల‌కు చెందిన నేత‌ల పేర్ల‌ను ప్ర‌ధాని ప‌రిశీలించారు.  విస్త‌ర‌ణ‌లో 20 మందికి చోటుద‌క్కే అవ‌కాశం ఉన్న‌ది.  ముఖ్యంగా వ‌చ్చే ఏడాది యూపీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న సంద‌ర్భంగా ఆ రాష్ట్రానికి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.  ఆరోజు లేదా రేపు ప్ర‌ధాని మోడి కేబినెట్ విస్త‌ర‌ణ‌కు సంబందించిన వివ‌రాలు తెలిపే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  

Read: గ్రామ‌ప‌ర్య‌ట‌కు వ‌చ్చిన మ‌క‌రం…భ‌యంతో ప‌రుగులు తీసిన జ‌నం…

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి జ్యోతిరాథిత్యా సింధియా, అస్సాం నుంచి మాజీ ముఖ్య‌మంత్రి స‌ర్బానంద సోనోవాల్‌, బీహార్ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి సుశీల్‌కుమార్ మోడి, సీనియ‌ర్ నేత భూపేంద్ర యాద‌వ్‌, యూపీ నుంచి వ‌రుణ్‌గాంధీ, రాంశంక‌ర్ క‌థేరియా, అనీల్‌జైన్‌, రీటీ బ‌హుగుణ జోషి, జ‌న‌శ‌క్తి నుంచి ప‌శుప‌తి ప‌రాస్‌, అప్నాద‌ళ్ నుంచి అనుప్రియ ప‌టేల్‌, జేడీయు నుంచి ల‌ల్లాన్ సింగ్‌, రామ్‌నాథ్ ఠాకూర్ ల‌ను బెర్తులు ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ది.  

Exit mobile version