గుజరాత్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు గుర్తించిన డీఆర్‌ఐ అధికారులు.. కాకినాడ పోర్టు ద్వారా భారీగా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు నిర్ధారించారు.. ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఢిల్లీకి చెందిన కుల్‌దీప్‌సింగ్ ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు.. జూన్‌లోనే ఆషీ ట్రేడింగ్ కంపెనీకి 25 టన్నుల డ్రగ్స్ రవాణా చేసినట్టు తెలుస్తోంది.. రాజస్థాన్‌కు చెందిన జయదీప్ లాజిస్టిక్ ద్వారా కాకినాడకు డ్రగ్స్ రవాణా చేసినట్టు గుర్తించారు.. తప్పుడు అడ్రస్‌లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు కుల్‌దీప్.. అంతేకాదు బియ్యం రవాణా ముసుగులో వీటిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నాడు. ముందుగా ఆప్ఘనిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుని.. సీ పోర్టుల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు.. బియ్యం, టాల్కం ఫౌడర్ పేరుతో మత్తుపదార్థాలు జోరుగా రవాణా చేస్తున్నారు. మరోవైపు కుల్‌దీప్‌ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు డీఆర్‌ఐ అధికారులు..
గుజరాత్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. కాకినాడకు లింక్..!
