భారత వ్యాపార రంగంలో ఎంతో పేరున్న గోద్రేజ్ గ్రూపు విభజనకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. త్వరలోనే ఈ వ్యాపార సామ్రాజ్యం రెండుగా చీలనుంది. దీనికి సంబంధించి అన్నదమ్ములు ఇద్దరూ వ్యాపారాలను పంచుకునేందుకు నిర్ణయించుకున్నారని వినికిడి. 124 ఏళ్ల ఈ వ్యాపార సామ్రాజ్యం విలువ ప్రస్తుతం4.1 బిలియన్ డాలర్లు. సబ్బులనుంచి మొదలు గృహోపరకరణాల రంగంలో గోద్రేజ్‌కు సాటిలేదు. ఇప్పటికే ఆస్తుల పంపకానికి సంబంధించి న్యాయ సహాలను సైతం తీసుకుంటున్నారని తెలిసింది.
గోద్రేజ్ గ్రూప్ చైర్మన్‌గా ప్రస్తుతం ఆది గోద్రేజ్(79) ఉన్నారు. ఆయనే దగ్గరుండి అన్ని వ్యాపారాలను నడిపిస్తున్నారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ అ్రగోవైట్‌కు ఆయన సోదరుడు నదీర్ చైర్మన్‌గా వ్యవహరి స్తున్నారు. ఈ గ్రూప్‌లోనే కీలకమైన గోద్రేజ్ అండ్‌బాయ్‌సీ మానుఫ్యాక్చరింగ్ కంపెనీనీ వారి కజిన్ జమ్‌షైద్ ఎన్ గోద్రేజ్ నడిపిస్తున్నారు. ఆది, నదీర్, జమ్‌షైద్, వారి సోదరి స్మితా గోద్రేజ్ చూసుకుంటున్న వ్యాపారాలను స్పష్టంగా రెండుగా విభజించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. విభజనపై గోద్రేజ్ కుటుంబం స్పందిస్తూ వాటాదారులను పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, దీనిలో భాగంగానే పరోక్ష భాగస్వాముల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామన్నారు.కుటుంబ సభ్యుల మధ్య చర్చలు సాగుతున్నాయన్నారు.
తమకు సన్నిహితులైన బ్యాంకర్లు నిమేశ్ కంపాని, ఉదయ్ కొటక్ న్యాయరంగంలోని జియామోడీ, సిరిల్‌ష్రాఫ్ తదితరుల సలహాలను గోద్రేజ్ గ్రూప్ తీసుకుంటుందని సమాచారం. గ్రూపుల్లో ఉన్నా 23 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా ట్రస్టుల్లో ఉందన్నారు. కుటుంబ సభ్యులకు గ్రూపుల్లోని అన్ని వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు వ్యాపార బాధ్యతలు తీసుకోవడంతో ఆది గోద్రేజ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుత యువతరం వారి కుటుంబ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకు వెళ్లేందుకు చొరవ చూపిస్తున్నట్టు సమాచారం .
