NTV Telugu Site icon

The Jaguar Land Rover Story: ‘‘జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్టోరీ’’.. అవమానించిన ఫోర్డ్, గర్వం అణిచిన టాటా..

Ratan Tata

Ratan Tata

The Jaguar Land Rover Story: భారతదేశ మహోన్నత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూపుల అధినేత రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు. అయితే, ఆయన దేశానికి అందించిన మార్గనిర్దేశకత్వం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. దేశాన్ని పారిశ్రామిక రంగం వైపు నడిపిన వ్యక్తుల్లో రతన్ టాటా ప్రముఖ వ్యక్తిగా ఉంటారనడంలో సందేహం లేదు. లక్షల కోట్ల విలువైన సంస్థకు అధిపతిగా ఉన్న ఆయన నిరాడంబరత ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయం.

ఇదిలా ఉంటే, ఓ సందర్భంలో టాటాని అవమానించిన సంస్థనే కొనుగులు చేసిన విషయం సంచలనం. ఇదే ‘‘జాగ్వార్ ల్యాండ్ రోవర్’’ కొనుగోలు అంశం ఇప్పటికీ ప్రపంచ పారిశ్రామిక సమాజంలో సంచలనమే. భారతీయ సంస్థ టాటా, బ్రిటీష్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మోటార్స్‌కి చెందిన ‘‘జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్’’ని కొనుగోలు చేసి తన సత్తాను చాటారు. ఈ కొనుగోలు ఒప్పందం భారతీయ ఆటోమోటివ్ పరిశ్రయమలో ఒక మలుపు మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతదేశ కార్పొరేట్ ఉనికి బలంగా చాటింది. ఈ చారిత్రత్మక కొనుగోలుని భారతదేశం యొక్క ‘‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ క్షణం’’గా ప్రశంసించారు.

ఏ సంస్థ అయితే తనను అవమానించిందో, అదే సంస్థను కొనుగోలు చేసి బ్రిటీష్ వాళ్ల గర్వాన్ని అణిచివేశారు రతన్ టాటా. ఇది రతన్ టాటాకు వ్యాపార విజయం కన్నా, వ్యక్తిగత విషయంగా పరిగణించబడుతుంది.

Read Also: Nagarjuna–Konda Surekha: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు..

జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కథ ఏంటి..?

1998లో టాటా మోటార్స్ ‘‘ఇండికా’’ కారుని తీసుకువచ్చింది. ఇది భారతదేశం యొక్క తొలి స్వదేశీ రూపకల్పన. డిజిల్‌తో నడిచే హ్యచ్‌బ్యాక్ కారు. ఈ కారుని రతన్ టాటా ఎంతో ప్రత్యేకంగా భావించారు. అయితే, ఇండియా అమ్మకాలు మాత్రం టాటా అనుకున్న విధంగా సాగలేదు. అమ్మకాలు నిరాశ పరిచాయి. అయితే, ఆ సమయంలో నష్టాలను తగ్గించుకునే ఉద్దేశంతో తన ప్రొడక్షన్ యూనిట్‌ని బ్రిటీష్ కార్ మేకర్ ‘‘ఫోర్డ్’’కి విక్రయించాలనుకున్నారు. 1999లో అప్పటి ఫోర్డ్ సీఈఓ బిల్ ఫోర్డ్‌ని కలిసేందుకు అమెరికా వెళ్లారు. అయితే, టాటా మోటార్స్‌కి ఆటోమోటివ్ రంగంలో బిజినెస్ లేదని, టాటా ఫ్లాంట్‌ని కొనుగోలు చేయడం టాటాకు అనుకూలంగా ఉంటుందని బిల్ ఫోర్డ్ రతన్ టాటాని తక్కువ చేసి మాట్లాడారు.

ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన రతన్ టాటా, టాటా మోటార్స్‌ని బలమైన ఆటోమేకర్ కంపెనీగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ప్రారంభంలో ఎదురుదెబ్బ తగిలినా టాటా ‘‘ఇండికా’’ని వదల్లేదు. తర్వాతి కాలంలో ఈ కార్ సూపర్ హిట్ అయింది. 2004 నాటికి టాటా మోటార్స్ ఇండికాని యూరోపియన్, ఆఫ్రికన్ మార్కెట్లకు కూడా ఎగుమతి చేసింది. 2007 నాటికి, ఇండికా దేశీయ అమ్మకాలత్లో 1,42,000 యూనిట్లను విక్రయించింది.

Read Also: Ratan Tata: రతన్ టాటా “పెళ్లి” ప్రయత్నాలు నాలుగు సార్లు విఫలం..

ఫోర్డ్‌కి దివాళా.. ఆదుకున్న టాటా:

ఆర్థిక అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. ‘‘ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయి’’ సరిగ్గా ఈ నాడుడి ఫోర్డ్‌కి వర్తిస్తుంది. 2008 నాటి ఫోర్డ్ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. కంపెనీ దివాళా తీసే స్థాయికి దిగజారింది. ఈ అవకాశాన్ని రతన్ టాటా వదులుకోలేదు. తన వ్యాపార చతురతతో టాటా మోటార్స్ ఫోర్డ్ నుంచి జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్‌ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ రెండు బ్రాండ్లు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ, టాటా గ్రూపులో చేరిన తర్వాత ఖరీదైన కార్ బ్రాండ్లుగా మారింది. ల్యాండ్ రోవర్‌ని కొనగోలు చేసిన మూడు ఏళ్లకు రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి.

టాటా నాయకత్వంలో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) గట్టిగా పుంజుకుంది. 2011 నాటికి జేఎల్ఆర్ అమ్మకాలు 9.87 బిలియన్ల యూరోలకు పెరిగాయి. 2018 నాటికి రెట్టింపు అయ్యాయి. దీని విలువ 25 బిలియన్ యూరోలకు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో జేఎల్ఆర్ 4,00,000 వాహనాలను అమ్మింది. టాటా మోటార్స్ దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఒక కీ ప్లేయర్‌గా అవతరించింది. భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది.