ఢిల్లీ బాంబ్ పేలుడు సూత్రధారి ఉమర్‌కు తగిన శాస్తి జరిగింది. భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాద అణిచివేత ఆపరేషన్‌లో భాగంగా పుల్వామాలో ఉగ్రవాది ఉమర్ ఇంటిని ఐఈడీతో పేల్చేశాయి. పేలుడులో ఉమర్ ఇల్లు తుక్కుతుక్కైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Maithili Thakur: ఫలితాలకు ముందే మైథిలి ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
సోమవారం ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబ్ పేలుడులో 13 మంది చనిపోగా.. పలువురు గాయాల పాలయ్యారు. కారులో ఉగ్రవాది ఉమర్ మందుగుండు సామాగ్రి తరలిస్తుండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనంతో పేలిపోయింది. ఈ పేలుడుతో శరీర భాగాలు ఆయా ప్రాంతాల్లో ఎగిరిపడ్డాయి. ఇక పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా కారు బాంబ్ పేల్చింది ఉగ్ర డాక్టర్ ఉమర్‌గా అధికారులు తేల్చారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రదాడులకు ఉమర్ ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే పలువురు ఉగ్ర డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా ఉగ్రవాద అణిచివేత కార్యక్రమాన్ని భద్రతా దళాలు చేపట్టాయి. ఇందులో భాగంగా శుక్రవారం పుల్వామాలో ఉగ్రవాది ఉమర్ ఇంటిని ఐఈడీతో పేల్చేశాయి. పేలుడులో పూర్తిగా ఇల్లు ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఉమర్ కొనుగోలు చేసిన మూడు వాహనాలు గుర్తింపబడ్డాయి. ఒకటి ఎర్రకోటలో పేలిపోగా.. మిగతా రెండు కార్లు ఆయా ప్రాంతాల్లో కొనుగొన్నారు.
