TCS: భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతోంది. 2026 ఫైనాన్షియల్ ఇయర్‌లో తన మొత్తం వర్క్‌ఫోర్స్ నుంచి 2 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఇది ప్రధానంగా మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్‌ని ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది.
Read Also: Raj Thackeray: 13 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి రాజ్ ఠాక్రే..
కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించడం, కొత్త టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం, AIని అమలు చేయడం వంటి కారణాల వల్ల కంపెనీ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడంలో భాగంగా దాదాపుగా 12,200 ఉద్యోగులకు లేఆఫ్ పలకనుంది. ‘‘మా క్లయింట్‌లకు సేవల పంపిణీపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవడానికి ఈ నిర్ణయాన్ని తగిన జాగ్రత్తతో ప్లాన్ చేస్తున్నాము’’ అని కంపెనీ చెప్పింది.
కస్టమర్ల నుంచి తగ్గిన డిమాండ్, ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఉద్యోగాల తొలగింపు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు సేవరెన్స్ పే, నోటీసు కాలానికి జీతం, ఇన్సూరెన్స్ పొలిసీలు కొనసాగింపు, ఔట్‌ప్లేస్‌మెంట్ సర్వీసులు మరియు మానసిక ఆరోగ్య సలహాలు అందించనున్నారు. ఈ నిర్ణయం కష్టతరమైందని కంపెనీ సీఈఓ కే. కృతివాసన్ అన్నారు. ప్రస్తుతం, టీసీఎస్‌లో మొత్తం 6.13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
