Tamota Price : రెండు వారాల్లో కిలో టమాట రూ.300?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత దేశంలో టమోటా సంక్షోభం ను ఎదుర్కొంటుంది.. గతంలో రెండు, మూడు రూపాయలు ఉన్న టమోటా ధర ఇప్పుడు కిలో రూ.200 లాస్కు పైగా పరుగులు పెడుతుంది.. ఇప్పటికి టమోటా రేటు అలానే మార్కెట్ లో కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ టమోటా రూ.300 లకు చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అందుకు కారణం భారీ వర్షాలే అని చెబుతున్నారు..ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా కూరగాయలు, పండ్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రానున్న రోజుల్లో వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టమాటా ధర రూ. 300 పైకి చేరే సూచనలు ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పంటల దిగుబడి భారీగా పడిపోతోంది. దాంతో టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..
టమోటా విత్తనాలు నాటినా వర్షాల కారణంగా అవి పాడై పోతాయని, అందుకే రైతులు ఇప్పట్లి కొత్త పంటలు వేసే సూచనలు కన్పించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా పండ్లు, కూరగాయల ధరలు రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయన్నారు. ధరలు తిరిగి సాధరణ స్థితికి రావడానికి కనీసం రెండు నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. నేషనల్ కమోడిటీస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫిసర్ సంజయ్ గుప్త ఈమేరకు వివరించారు. అదే విధంగా టమోటా ప్యూరి కూడా రేటు భారీగా పెరిగిందని తెలుస్తుంది.. మరో విషయం ఏంటంటే ప్రస్తుతం టమోటా పేస్ట్ కు స్టాక్ లేదని, విదేశాల నుంచి వచ్చినవి కూడా క్షణాల్లో సేల్ అయ్యాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు..
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
ప్రస్తుతం ఢిల్లీ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కేజీ టమాటా ధర రూ. 200 గా ఉంది. కాలిఫ్లవర్ రూ. 110, కేజీ అల్లం రూ. 370, పచ్చి మిర్చి కేజీ రూ. 230 గా ఉంది. భారీ వర్షాల కారణంగా దేశంలోని ఆయా ప్రాంతాల్లో వీటి సరఫరాకు కొరత ఏర్పడి రేట్లు పెరిగాయి..దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలో కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రాలు సామర్థ్యానికి తగినట్లుగా టమాటాను ఉత్పత్తి చేయడం లేదు. వర్షాలు, వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గి సరఫరాకు కొరత ఏర్పుడుతోంది. దీంతో కేజీ టమాటా ధర ఆకాశాన్ని తాకుతోంది. టామాటా తక్కువ సమయంలోనే పండే పంట కావడం, ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం, అలాగే తెగుళ్ల బారినపడటం, కఠిన వాతావరణ పరిస్థితులు వంటి కారణాలు ఈ పంట దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో టమాటా పంటను కొత్త వైరస్ దెబ్బతీసింది.. దాంతో దిగుబడి పూర్తిగా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.. ఇక టమోటా దారిలోనే ఉల్లిపాయలు కూడా సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని తెలుస్తుంది.. మరో కొద్ది వారాల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి