Terror Attack Plan: తమిళనాడులో రాష్ట్రంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. తిరుప్పూర్, తమిళనాడులోని ఐదు ప్రాంతాల్లో ఉంటూ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకై కంటెంట్ పోస్ట్ చేస్తున్న ఆరుగురు అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో తిరుప్పూర్ గార్మెంట్ పరిశ్రమలో నిందితులు పని చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చి ఆరుగురు నిందితులను ‘Q’ బ్రాంచ్ స్పెషల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక, ఆరుగురు నిందితుల దగ్గర నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను విచారణ కోసం ఢిల్లీకి తరలించారు. కంటెంట్ పోస్టుతో పాటు పేలుళ్ల కుట్రకు పాల్పడుతున్నారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
Terror Attack Plan: తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం.. ఆరుగురు అరెస్ట్
- తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం..
- ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- నిందితుల నుంచి 8 ఫాన్స్, 16 సిమ్ కార్డులు స్వాధీనం..

Tn