Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లా తిట్టకుడి సమీపంలోని తిరుచి చెన్నై జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. తిరుచిరాపల్లి నుంచి చెన్నైకి వెళ్తున్న తమిళనాడు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ముందు టైర్లు పంచర్ అవ్వడంతో అదుపుతప్పి, అవతల వైపు జాతీయ రహదారిపై వస్తున్న రెండు కార్లపైకి దూసుకు వెళ్ళింది. అత్యంత వేగంగా రెండు కార్లును ఢీకొట్టింది. కార్‌లలో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు.

Read Also: Bangladesh Crisis: బంగ్లాదేశ్ రాజధానిలో పేలుడు, ఒకరి మృతి..

బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలు కావడంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. పోలీసులు కారులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంతో చెన్నై తిరుచి జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అత్యంత వేగంగా వెళుతున్న బస్సు టైరు పంచర్ అవ్వడంతో డివైడర్ ఢీ కొట్టి అవతల వైపు రోడ్డులో వస్తున్న కారులను ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Exit mobile version