Site icon NTV Telugu

CM MK Stalin: ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్.. కొనసాగుతున్న చికిత్స..!

Stalin

Stalin

CM MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ఇవాళ (జూలై 21న) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్ చేస్తుండగా కల్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఇక, అపోలో హాస్పిటల్‌ వైద్య బృందం సీఎం స్టాలిన్ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, స్టాలిన్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్‌ వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి.

Read Also: HHVM : హరిహర వీరమల్లు కథ ఏంటో చెప్పేసిన పవర్ స్టార్

ఇక, అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్ డాక్టర్‌ అనిల్ బీజీ మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో సీఎం స్టాలిన్‌కు తీవ్ర అస్వస్థత కలిగింది.. కళ్లు తిరగడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నాం.. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది అని వెల్లడించారు. ఈ మేరకు సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆధికారిక హెల్త్‌ బులెటిన్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.

Exit mobile version