Site icon NTV Telugu

Viral: వెండి నాణేల కోసం ఆర్డర్ పెడితే.. ఏం వచ్చాయో తెలుసా..

Untitled Design (8)

Untitled Design (8)

మనం కిరాణా సామాగ్రి, స్నాక్స్. ఫుడ్ ఆర్డర్స్ అన్ని స్విగ్గి, జోమాటో.. వేరే యాప్ లలో ఆర్డర్స్ చేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి స్విగ్గి ఇన్ స్టా మార్ట్ లో వెండి నాణేల కోసం ఆర్డర్ పెట్టాడు. కానీ అతడికి వింత అనుభవం ఎదురైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వినీత్ అనే వ్యక్తి స్విగ్గి ఇన్ స్టా మార్ట్ లో వెండి నాణేల కోసం ఆర్డర్ పెట్టాడు. ఇంత వరకు బాగానే ఉంది. ఆర్డర్ కూడా టైంకి వచ్చేసింది. కానీ ఆర్డర్ ఓపెన్ చేసి చూసేసరికి అతడు షాక్ కు గురయ్యాడు. బ్యాగులో వెండి నాణేల బదులుగా మ్యాగీ న్యూడిల్స్, హల్ధి రామ్స్ ప్యాకెట్లు వచ్చాయి. దీంతో డెలివరీ ఇచ్చిన వ్యక్తిని ఇదేంటని ప్రశ్నించడంతో తనకు ఏం తెలియదని అతడు చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని వినీత్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.

తాను రెండు ప్యాకెట్స్ ఆర్డర్ ఇచ్చానని మొదటి ప్యాకెట్ ఓపెన్ చేయగానే.. మ్యాగీ న్యూడిల్స్, హల్ధి రామ్స్ ప్యాకెట్లు ఉన్నాయి. రెండోది ఓపెన్ చేయాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు.. తనకు ఆర్డర్ తెచ్చిన ఒక మాట చెప్పాడని తెలిపాడు. అదేంటంటే.. ఓపెన్ చేస్తే రెండు ఓపెన్ చేయాలి.. లేకపోతే క్యాన్సిల్ చేయమన్నాడు. దాదాపు 40 నిమిషాలు అతడితో వాదించి.. చివరకు తాను ఓపెన్ చేసేందుకు నిర్ణయించుకున్నానని తెలిపాడు. రెండో ప్యాకెట్లో వెండి నాణేలు ఉన్నాయని.. కానీ పూర్తి 999 స్వచ్ఛత కాదని .. వాటికి బదులుగా 925 స్టెర్లింగ్ వెండి నాణేలు పంపినట్లు వారు చెప్పుకొచ్చారు. ఇతర ఆహార ప్యాకెట్లను డెలివరీ బాయ్ తిరిగి తీసుకున్నాడు . వాటిని తిరిగి ఇవ్వలేకపోతే వాటిని ఉంచుకోమని కూడా వినీత్ అతనికి చెప్పాడు: “నేను వీటిని ఆర్డర్ చేయలేదు, కాబట్టి నాకు అవి వద్దు” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version