Site icon NTV Telugu

Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం..

Sunetra Pawar (1)

Sunetra Pawar (1)

Sunetra Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు(శనివారం) పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా డిప్యూటీ సీఎంగా ఆమె రికార్డ్ స‌ృష్టించారు. అజిత్ పవార్ మరణం తర్వాత మూడు రోజులకే ఆమె అత్యున్నత పదవిని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు. ఎన్సీపీ కీలక నేతలు, ఎమ్మెల్యేల సమక్షంలో ప్రమాణస్వీకారం జరిగింది. సునేత్ర ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎన్సీపీ నేతలు ‘‘అజిత్ పవార్ అమర్ రహే’’ అని నినదించారు.

Exit mobile version