Site icon NTV Telugu

UP Polls: అఖిలేష్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఈ నెల 10వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి.. ఇక, సోమవారం పోలింగ్‌ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో మరోసారి యూపీలో విజయం సాధించేది బీజేపీయేనని స్పష్టమైంది.. అన్ని సర్వేలు.. మరోసారి యూపీలో యోగి సర్కార్‌ కొలువు తీరబోతోందని స్పష్టం చేశాయి.. అయితే, మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల కమిషన్‌ను మేం నమ్మడం లేదన్న ఎస్పీ చీఫ్‌.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపించారు.. కౌంటింగ్‌కు ముందే ఈవీఎంలను మార్చారని విమర్శలు గుప్పించారు… ఎన్నికల కమిషన్‌ అధికారులే ఈవీఎంలను మార్చేశారని సంచలన ఆరోపణలు చేశారు.. బీజేపీ ఓడిపోయే నియోజకవర్గాలన్నింటిలో ఈవీఎంలను మార్చారని వ్యాఖ్యానించి.. పెద్ద చర్చకు తెరలేపారు.

Read Also: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం

ఇక, ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా… ఎన్నికల కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతోంది సమాజ్‌వాదీ పార్టీ… ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లనున్నారు ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్‌ బృందం… ఈవీల ట్యాపరింగ్ సంచలన ఆరోపణల చేసిన ఎస్పీ.. ఎప్పుడు ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేయనుంది.. పార్టీ కార్యాలయంలోని తన గదిలో కొందరు ముఖ్యులతో మంతనాలు జరిపిన అఖిలేష్ యాదవ్.. ఆ తర్వాత ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు.

Exit mobile version