Site icon NTV Telugu

Honeymoon murder case: భర్తని చంపేందుకు ప్లాన్-బీ రెడీ చేసిన సోనమ్.. మేఘాలయ కేసులో సంచలనం..

Sonam

Sonam

Honeymoon murder case: సంచలనంగా మారిన మేఘాలయ హనీమూర్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. పెళ్లయి నెల రోజులు గడవక ముందే హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకువెళ్లి కిరాయి హంతకులతో హతమార్చింది. మే 23 నుంచి కనిపించకుండా పోయిన రాజా రఘువంశీ మృతదేహం జూన్ 02న మేఘాలయలోని కాసీ హిల్స్‌లో దొరికింది. పోలీసులు రాజాది హత్యగా తేల్చారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారులు సోనమ్, ఆమె లవర్ రాజ్ కుష్వాహా కాగా, ముగ్గురు హంతకులు- విశాల్, ఆనంద్, ఆకాష్‌లు హత్యకు పాల్పడ్డారు. భార్య సోనమ్ ముందు, రాజా రఘువంశీని ముగ్గురు హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని లోయలో పారేసేందుకు సోనమ్ నిందితులకు సాయం చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత, అక్కడ నుంచి పరారైన సోనమ్, జూన్ 08న ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది.

Read Also: Pakistan: “సిందూర్” దాడుల్ని పరదాలతో కప్పుతున్న పాకిస్తాన్..

అయితే, ఒకవేళ విశాల్, ఆనంద్, ఆకాష్‌లు రాజా రఘువంశీని చంపకపోతే ప్లాన్-బీని కూడా సోనమ్ సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఫోటో తీస్తూనే అతడిని లోయలోకి తోసేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో చెప్పినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.

సోనమ్ తన వివాహం తర్వాత నాలుగు రోజులకు మే 15న ఇండోర్‌లోని తన తల్లి ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే హత్య ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. రాజ్ కుష్వాహాతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్లాన్ గురించి చర్చించింది. ప్లాన్ ప్రకారం, కుష్వాహా మినహా మిగిలిన నిందితులు రాజ్ దంపుతులను మేఘాలయ వరకు ఫాలో అయ్యారు. ఆ తర్వాత పథకం ప్రకారం హత్య చేశారు.

Exit mobile version