NTV Telugu Site icon

Viral Image: ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేసిన ఏచూరి

Generalsecretarysitaramyech

Generalsecretarysitaramyech

దివంగత మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ పక్కనే నిలబడి రాజీనామా చేయాలంటూ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) గురువారం మధ్యాహం 3:05 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీలు సంతాపం తెలిపారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఇమేజ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో సీతారాం ఏచూరి చూపించిన తెగువ, పోరాట పటిమను కాంగ్రెస్ నేత గుర్తుచేశారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో ఏచూరి ఉన్న ఫొటో వెనుక ఉన్న ఉద్దేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: AP CM Chandrababu: సాధారణ విపత్తులా ఈ విపత్తును చూడకండి.. ఉదారంగా సాయం చేయండి..

ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీ జేఎన్‌యూకి ఇందిరాగాంధీ వైస్ ఛాన్సలర్‌గా ఉండేవారు. 1977లో జేఎన్‌యూలో ఏచూరి విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. అదే సమయంలో ఏచూరి పెద్ద ఎత్తున విద్యార్థులను వెంట వేసుకుని ఇందిరాగాంధీ ఇంటిని ముట్టడించారు. విద్యార్థుల ఆందోళన చూసి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. విద్యార్థులతో మాట్లాడుతుండగా డిమాండ్లు చెప్పాలని ఇందిర అడిగారు. ఆమె పక్కనే ఉన్న ఏచూరి ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఇందిరాగాంధీ పవర్ ఫుల్ లేడీగా, ఐరన్‌ లేడీగా గుర్తింపు పొందారు. అలాంటిది.. ఆమె పక్కనే నిలబడి ఆమె రాజీనామాను కోరడం.. విద్యార్థి నాయకుడిగా అతడు చూపించిన తెగువను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ అధికారం కోల్పోవల్సి వచ్చింది. అయినా కూడా ఆమె ఛాన్సలర్ పదవికి రిజైన్ చేయలేదు. అనంతరం కొద్దిరోజుల తర్వాత రాజీనామా సమర్పించారు.

ఇది కూడా చదవండి: Kolkata: 2 గంటలు సీఎం మమత నిరీక్షణ.. చర్చలకు రాని డాక్టర్లు.. రాజీనామాకు రెడీ అంటూ ప్రకటన!

యుక్తవయసులో ఏచూరి చాలా చురుగ్గా ఉండేవారు. పలుమార్లు విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారంటే ఆయన కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల మరియు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా ఉన్నారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1975లో CPIMలో చేరారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించినప్పుడు JNU నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్‌ను అభ్యసిస్తున్నారు. 1975లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం రావడంతో ఇతర నాయకులతో పాటు ఏచూరి అరెస్టయ్యారు. పీహెచ్‌డీ మాత్రం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఏచూరి జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో మూడు సార్లు JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే అతను జీవితాంతం తోడుగా ఉండే ప్రకాష్ కారత్‌ని కలిసి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1992లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.

 

Show comments