Site icon NTV Telugu

పబ్ లో షాట్స్ ఆర్డర్ చేసిన యువతి.. అతడు అలా చేయడంతో చివరికి

సరదాగా పబ్ కి వెళ్లిన ఆ యువతికి చేదు అనుభవం ఎదురయ్యింది. షాట్స్ తాగి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామనుకున్న ఆమె ఆసుపత్రి పాలయ్యింది. పబ్ స్టాపర్ నిర్లక్ష్యం వలన ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం బెంగుళూరుకు చెందిన ఒక యువతి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి రెసిడెన్సీ రోడ్ లోని ఒక పబ్ కి వెళ్లింది. మిగతా స్నేహితులందరూ ఆ పబ్ లో  సాంబుకా షాట్స్ బావుంటాయని చెప్పడంతో వాటినే ఆర్డర్ చేసింది. పబ్ స్టాపర్ ఆ వేడి వేడి షాట్స్ ని డైరెక్ట్ గా గొంతులోనే పోసుకోవాలని చెప్పడంతో పాటు అలాగే ఆమె గొంతులో పోసేశాడు. దీంతో ఒక్కసారిగా యువతి గొంతులో మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా ఊహించని ఘటనను చూసి షాక్ అయిన ఆమె స్నేహితులు వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. కొన్ని రోజూల తర్వాత కోలుకున్న ఆమె ఆ పబ్ పై కన్జ్యూమర్ కోర్టు లో కేసు వేసింది. తాను ఆసుపత్రి పాలు కావడానికి కారణం పబ్ స్టాపర్ యేనని తెలుపుతూ మెడికల్ రిపోర్ట్స్, బిల్స్ అన్ని కోర్టు లో సబ్మిట్ చేసింది. వాదోపవాదాలు విన్న కోర్టు పబ్ దే తప్పని, ఆమె మెడికల్ బిల్స్ మొత్తాన్ని పబ్ యాజమాన్యమే క్లియర్ చేయాలని తెలుపుతూ తీర్పు చెప్పింది. దీంతో సదరు పబ్ యాజమాన్యం ఆమె మెడికల్ బిల్ రూ. 74 వేలతో పాటు కోర్టు ఖర్చులను కూడా చెల్లించింది.

Exit mobile version