కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తాత అయ్యారు. పెద్ద కుమారుడు కార్తికేయ, అమనాత్ బన్సాల్‌కు ఆడ పిల్ల జన్మించింది. ఇక ఆడబిడ్డకు గుర్తుగా ఎక్స్‌లో కేంద్రమంత్రి ఒక వీడియోను షేర్ చేశారు. పర్యావరణ సందేశాన్ని గుర్తు చేస్తూ ఒక మర్రి చెట్టును నాటారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనవరాలికి మర్రిచెట్టు అర్థం వచ్చేలా పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. మనవరాలి రాకతో కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: ఏడాదిలోపే చైనా తినేస్తోంది.. కెనడాకు ట్రంప్ వార్నింగ్
శివరాజ్‌సింగ్ చౌహాన్ తన పోస్టులో.. ‘‘నేను ప్రతిరోజు చెట్లు నాటినా.. ఈరోజు నాటడం నాకు చాలా ప్రత్యేకమైంది. నా ప్రియమైన కుమార్తె ఇలా శుభ రాకకు గుర్తుగా నేను ‘మర్రి చెట్టు’ను నాటాను. భూమి అందరినీ చూసుకుంటుంది. ఈ మర్రిచెట్టు కూడా అందరికీ నీడను ఇస్తుంది. అనేక జంతువులకు ఆశ్రయం ఇస్తుంది. నా కుమార్తె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అర్థవంతమైన జీవితాన్ని గడపాలి. శుభాకాంక్షలు.’’ అంటూ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: ఎన్నికల వేళ కీలక ఘట్టం.. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ బిల్లుకు ఆమోదం
కార్తికేయ-అమానత్‌కు 2025 మార్చిలో వివాహం జరిగింది. ఈ దంపతులిద్దరూ తల్లిదండ్రులయ్యారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఆస్పత్రిలో కార్తికేయ బిడ్డను ఎత్తుకున్నప్పుడు శివరాజ్ సింగ్ చాలా ఆనందించారు. మనవరాలిని చూస్తూ గాయత్రి మంత్రాన్ని పఠించారు.
वैसे तो मैं प्रतिदिन पौधरोपण करता हूँ, लेकिन आज का यह पौधरोपण मेरे लिए बहुत खास है। आज मैंने अपनी लाड़ली बेटी इला के शुभ आगमन पर 'वट वृक्ष' लगाया है।
इला यानी धरती, जो सबका ध्यान रखती है। ये वट वृक्ष भी सबको छाँव देगा, कई जीव-जंतुओं का आश्रय बनेगा।
बेटी इला हमेशा सुखी रहे और… pic.twitter.com/c9Zompc38B
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 22, 2026
