Site icon NTV Telugu

Spent on Ads: ప్రకటనల కోసం రూ.3,339 కోట్లు.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

Spent On Ads

Spent On Ads

Spent on Ads: కేంద్రం 2017 నుంచి ప్రకటనల కోసం రూ. 3,339 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ రాజ్యసభలో వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. 2017 నుంచి గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు. 2017-18 నుంచి ఈ ఏడాది జూలై 12 వరకు ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం ప్రభుత్వం రూ.1,756.48 కోట్లు ఖర్చు చేసిందని అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Chess Olympiad: చెస్ ఒలింపియాడ్ షురూ.. ప్రధాని మోదీ చేతుల మీదుగా పోటీలు ప్రారంభం

అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం రూ.1,583.01 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా విదేశీ మీడియాలో ప్రకటనలపై ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ ఖర్చు చేయలేదని మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

Exit mobile version