Road accident in odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝార్సుగూడ-సంబల్ పూర్ బిజూ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ పవర్ హౌజ్ చర్ సమీపంలో బొగ్గు లారీ, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బస్సు జెఎస్ డబ్ల్యూ ప్లాంట్ నుంచి ఝార్సూగూడ పట్టణానికి ఉద్యోగులను తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. మృతులంతా ఫ్లాంట్ లో పనిచేసే వారే. వీరంతా విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఆరుగురు మరణిించగా.. మరో 20 మంది గాయపడ్డారు.
Read Also: Warangal: జాతీయజెండాకు అవమానం.. అసలేం జరిగిందంటే?
గాయపడిన వారిని సంబల్‌పూర్ బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ (విమ్స్‌ఆర్)కి తరలించారు. వీరంతా ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. చాలా మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. 10 మంది సంబల్‌పూర్‌లోని బుర్లాలోని ఆసుపత్రికి రిఫర్ చేయగా, 14 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు” అని జార్సుగూడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ మోహపాత్ర తెలిపారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇటీవల వరసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాశ్మీర్ లో బుధవారం, గురువారం వరసగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు ప్రమాదాల్లోనూ బస్సులు అదుపుతప్పి లోయల్లో పడ్డాయి. గురువారం రాజౌరి జిల్లాలో లోయలో బస్సు పడిన ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. అంతకుముందు రోజు పూంఛ్ జిల్లాలో ఇదే విధంగా ప్రమాదం జరిగింది. లోయలో మినీబస్సు పడిపోవడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు.
