Site icon NTV Telugu

Road Accident : 2 బస్సులు ఢీ..30 మందికి తీవ్రగాయాలు..

Pune

Pune

Pune-Ahmednagar Road Accident : పూణే -అహ్మదాబాద్ రోడ్డులో భారీ రోడ్డు భారీ ప్రమాదం జరిగింది.. పూణే-అహ్మద్‌నగర్ రోడ్డులో మంగళవారం ఉదయం బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) లేన్‌లో పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (PMPML) వైపు వెళ్తున్న రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఎనిమిది మంది మహిళలు సహా కనీసం 30 మంది తీవ్రంగా గాయపడ్డారు… PMPML అధికారులు సంఘటనను ధృవీకరించారు.. ఈ ప్రమాదం పై పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సాసూన్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

ఖరాడి ప్రాంతంలో ఉదయం ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు విమంతల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. రెండు PMPML బస్సులు – ఒకటి పూణే నుండి తలేగావ్ ధామ్‌ధేర్‌కు వెళుతుండగా, మరొకటి వాఘోలి నుండి వచ్చి వార్జే మాల్వాడి వైపు వెళుతుండగా .. జనక్ బాబా దర్గా బస్టాండ్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. వాఘోలీ నుండి వస్తున్న బస్సులో 22 మంది ప్రయాణికులు తలేగావ్ ధామ్‌ధేరే బస్సులో ఉన్న మరో ఏడుగురు, రెండు బస్సుల డ్రైవర్లు, వారి సహాయకులతో సహా గాయపడ్డారని పోలీసులు తెలిపారు..

రెండు బస్సులు వేగంగా ఢీకొనడంతో రెండు బస్సుల ముందు భాగాలు భారీగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిలో ఎనిమిది మంది మహిళలు, 17 మంది మగ ప్రయాణికులు. అలాగే మరో నలుగురు ఉన్నారు – రెండు బస్సుల డ్రైవర్లు మరియు కండక్టర్లు’ అని విమంతల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. తలేగావ్ ధామ్‌ధేరే నుండి పూణేకు వెళ్తున్న బస్సు డ్రైవర్ బలుపంచి ఫండే మాట్లాడుతూ, ‘ఎదురుగా వస్తున్న బస్సును అతి వేగంతో నడుపుతున్నారు. నా చేతికి గాయాలు కాగా తలకు ఐదు కుట్లు పడ్డాయని తెలిపారు.. గాయపడిన వారికి వైద్యాన్ని అందిస్తున్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Exit mobile version